లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఝాన్సీ ఐపీఎస్. గురుప్రసాద్ దర్శకుడు. కన్నడ, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఆర్‌కే ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. సోమవారం ట్రైలర్‌ను సీనియర్ నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ఫైట్స్‌తో అదరగొట్టిందని అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ లక్ష్మీరాయ్ త్రిపాత్రాభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై లేడీ ఐపీఎస్ ఆఫీసర్ చేసిన పోరాటం ఆకట్టుకుంటుంది. డ్రగ్స్ ముఠాలు, గ్రామాల్లో రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసే పవర్‌ఫుల్ పోలీస్‌గా లక్ష్మీరాయ్ పాత్ర సాగుతుంది. నవంబర్ రెండోవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)