అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో జరుగుతున్న జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, అక్కడ గమ్మత్తుగా ప్రవర్తించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ఓ స్టేజ్‌పై కలిసేందుకు వెళ్లిన ఆయన ఆ నేతను హగ్ చేసుకున్న తర్వాత చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయారు. కన్ఫ్యూజన్‌లో ఉన్న బైడెన్ ఇటలీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉన్నది. ఇక మరో వీడియోలో బైడెన్ ఎంత గందరగోళానికి గురవుతున్నారో స్పష్టమైంది.
జీ7 సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కడే మరో వైపు వెళ్లిపోయారు. కొన్ని ఫీట్ల దూరం వెళ్లిన తర్వాత ఆయన ఎవరూ లేని దిశకు థమ్స్ అప్ చూపించారు. మనుషులు లేని దిక్కుకు వెళ్లి బైడెన్ ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియడంలేదు. కానీ ఆ సమయంలో ఇటలీ ప్రధాని మెలానీ త్వరగా తేరుకుని, బైడెన్ వద్దకు వెళ్లి ఆయన్ను గ్రూప్ నేతలకు దగ్గరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆగ్రూప్ ఫోటోలకు ఫోజు ఇచ్చింది.