అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు. ఆఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా అమెరికా, నాటో బలగాల సంరక్షణలో ఉన్న అఫ్గానిస్థాన్‌ను తాజాగా తాలిబన్లు హస్తగతం చేసుకోవడం ఈ సమయంలో బైడెన్ వ్యరించిన తీరును ట్రంప్ తప్పుబట్టారు. అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులకు కారణమైనందుకు అవమానంగా బైడెన్ రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. అంతేకాకుండా అఫ్గాన్ విషయంలో జో బైడెన్ గొప్ప పని చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన ఆయన అమెరికా చరిత్రలో జరిగిన ఫెయిల్యూర్స్ ఇది ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు.