Namaste NRI

జో బైడెన్ మరోసారి టంగ్‌ స్లిప్‌…పేరు గుర్తురాక దాన్ని ప్రతిపక్షంగా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  మతిమరుపు, తడబాట్ల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ నెట్టింట విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన టంగ్‌ స్లిప్‌ అయ్యి వార్తల్లోకెక్కారు. సమయానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ పేరు గుర్తురాక దాన్ని ప్రతిపక్షంగా పేర్కొన్నారు.

ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు నిధులు అందించే ద్వైపాక్షిక ఇమ్మిగ్రేషన్, సరిహద్దు ఒప్పందానికి మద్దతు ఇవ్వాల ని రిపబ్లికన్లను కోరుతూ బైడెన్ ప్రసంగించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల చర్చల పురోగతి గురించి అధ్యక్షుడిని మీడియా ప్రశ్నించింది. మీడియా ప్రశ్నకు బైడెన్‌ స్పందిస్తూ హమాస్‌ పేరు గుర్తురాక ఆపసోపాలు పడ్డారు. చివరికి తరబడుతూ ప్రతిపక్షం గా పేర్కొన్నారు. ప్రతిపక్షం నుంచి ప్రతి స్పందన వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. కొంత కదలిక ఉంది అని తడబడుతూ ఆగిపోయిన బైడెన్‌ నన్ను పదాలు వెతుక్కోనివ్వండి. ప్రతిస్పందన ఉంది. ప్రతిపక్షం నుంచి ప్రతిస్పందన వచ్చింది, కానీ అంటూ చెప్పుకొచ్చారు. చివరికి ఒక రిపోర్టర్ హమాస్ అని చెప్పగానే అవును, నన్ను క్షమించండి అని బైడెన్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events