బాలీవుడ్ బెబో కరీనాకపూర్ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ది బకింగ్‌హమ్ మర్డర్స్. ఈ సినిమాకు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్కామ్1992, ఛల్, షాహిద్, సిటీలైట్స్ చిత్రాల ఫేమ్ హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇంగ్లాండ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా, థ్రిల్లర్ జానర్‌లో కరీనా నటించబోతున్నట్లు తెలుస్తుంది. మహాన ఫిలిం బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను కరీనాకపూర్‌తో కలిసి శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మిస్తున్నారు.