
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం. ఈ చిత్రంలో కేతికా శర్మ ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలోని మూడో గీతాన్ని ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటలో కేతికా శర్మ అల్ట్రా గ్లామరస్ అవతార్‌లో కనిపిస్తుందని, జీవీ ప్రకాష్ కుమార్ బాణీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబిన్‌హుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, మ్యూజికల్‌గా ఈ సినిమా అందరిని అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.
