యూకే వీసా ఫీజులు పెంచుతూ సునాక్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జీలు పెరిగిన నేపథ్యంలో వీసా ఫీజు ఏడాదికి రూ.51,828 (624డాలర్లు) నుంచి 85,964 (1,035) డాలర్లకు పెంచింది. 18 ఏండ్లలోపు స్టూడెంట్స్‌కు వీసా ఫీజు ఏడాదికి 39,037 (470 డాలర్లు) నుంచి రూ. 64,452 (776 డాలర్లు)కు పెంచుతున్నట్టు వెల్లడించింది. యూకేలో ప్రవేశం లేదా నివాసం కోసం దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఇమ్మి గ్రేషన్ హెల్త్ సర్‌చార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంచిన వీసా ఫీజులను ఈ ఏడాది జనవ రి 16 నుంచి అమలు చేయాలని అనుకున్నప్పటికీ పార్లమెంట్ వాయిదాలతో ఫిబ్రవరి 6కు మార్చారు.