తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నరేన్‌కు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద ఆత్మీయ మిత్రుల మధ్య అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ విద్యావేత్త, సౌమ్యుడు అయిన నరేన్ తన కార్యదక్షతతో తానా ఖ్యాతిని మరో స్థాయికి చేర్చి ఇనుమడింపచేయగలడని తన హర్షాన్ని వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల తమ స్నేహబంధాన్ని గుర్తు చేసుకొని తెలుగు వారికి ఇక ముందూ సమిష్టిగా అందరం చేయూత నందిస్తామని తెలిపారు. పాతూరి నాగభూషణం మాట్లాడుతూ తానా ఉన్నంత వరకూ తెలుగుభాష అస్తిత్వం అమెరికాలో ఉంటుందన్నారు.

రామ్ చౌదరి ఉప్పుటూరి, నరేన్‌ను అభినందించి తానా సేవా పరిధిని విస్తృతపరచాలని కోరారు. ఆత్మీయ సోదరుల మధ్య, బాణ సంచా కాల్చి ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కొడాలి నరేన్ తన కృతజ్ఞతలు తెలిపారు. తానా తన జీవిత గమనంలో ఒక భాగమని, సంస్థ ఉన్నతికి తన శక్తిని మించి అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శిగా ఎన్నికైన సత్య సూరపనేని, మన్నే సత్యనారాయణ, కృష్ణ లామ్, సుధీర్ కొమ్మి, భాను మాగులూరి, కార్తిక్ కోమటి, రవి అడుసుమిల్లి, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, సతీష్ చింతా, యువ సిద్దార్థ్ బోయపాటి పాల్గొన్నారు.