ఈ నెల 15 నుంచి ఇండోనేషియాలోని బాలీలో జీ20 సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తైవాన్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర తైవాన్ తమకే చెందుతుందని చైనా వాదిస్తున్నది. అయితే ఆ దేశం విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బైడెన్ కూడా కీలక నిర్ణయం తీసుకునే ఛాన్సు ఉంది.
