Namaste NRI

వాలెంటైన్స్ డే సందర్భంగా కోర్ట్-స్టేట్ వర్సెస్ ఎ నోబడీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేమలో

హీరో నాని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి కీలక పాత్రల్ని పోషించారు. రామ్జగదీష్ దర్శకుడు. ప్రశాంత్ తిపిర్నేని నిర్మాత. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్.. ప్రేమలో అనే పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించారు నాయకానాయికల మధ్య ప్రేమకథను ఆవిష్కరిస్తూ చక్కటి మెలోడీతో ఈ పాట సాగింది. సమకాలీన అంశాలను చర్చిస్తూ సామాజిక సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, మార్చి 14న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాత: దీప్తి గంటా, కథ, దర్శకత్వం: రామ్ జగదీష్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events