Namaste NRI

మంచు విష్ణు కన్నప్ప టీజర్ వచ్చేసింది

మంచు విష్ణు  హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం కన్నప్ప. మోహ‌న్ బాబు నిర్మాణంలో వ‌స్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తు న్నారు. మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధు బాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం తాజాగా టీజ‌ర్‌ ను విడుద‌ల చేసింది. టీజ‌ర్ చూస్తే.. క‌థ రివీల్ చేయ‌కుండా ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా సాగింది.

మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ కన్నప్ప ప్రతి తరానికి కనెక్ట్‌ అవుతుంది. ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. వివిధ భాషల్లోని అగ్ర నటుల్ని ఈ చిత్రంలో భాగం చేశాం అన్నా రు.  ప్రభాస్‌ కోసం కృష్ణంరాజు ఈ కథను సిద్ధం చేశారు. మేము అడిగిన వెంటనే ఆయన కథను ఇచ్చారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చాం. నిర్మాతగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిస్తున్నది అన్నారు.

కన్నప్ప మైథాలజీ చిత్రం కాదని, రెండో శతాబ్దంలో చోళ రాజుల కాలంలో జరిగిన నిజమైన కథ ఇదని, చరిత్ర లో నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. అపరశివ భక్తుడి కథగా కన్నప్ప అందరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు ముఖేష్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events