భిజ్ఞ పూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ఉత్కంఠ భరిత వెబ్ సిరీస్ విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్ర్కీన్స్ బేనర్‌పై కేవీ శ్రీరామ్ నిర్మించారు. ఈనెల 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.విరాటపాలెం గ్రామానికి ఓ శాపం ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా సరే మరుసటి రోజు పెళ్లి కూతురు చనిపోతుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని శాపం పట్టి పీడిస్తోందని ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి ఊరికి లేడీ కానిస్టేబుల్ మీనా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దాని చుట్టూ కథ సాగుతుంది. కథ 1980 కాలానికి చెందినదని ట్రైలర్‌ని చూస్తే అర్థమౌతుంది.

ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపించారు. రెక్కీ నాకు ఎంతో ఇష్టమైన సిరీస్, అదే దర్శకుడు మళ్లీ ఈ సిరీస్‌తో వస్తున్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచీ అభిజ్ఞ నాకు తెలుసు, ఆమె అద్భుతమైన నటి. దివ్య వంటి రచయితలకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా అవకాశం ఇస్తే బాగుండేది. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్‌లో ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ను కూడా స్పృశించినట్లు కనిపిస్తోంది. జూన్ 27న వస్తున్న ఈ సిరీస్‌కు మంచి విజయం రావాలని కోరుకుంటున్నట్లు నవీన్ తెలిపాడు. చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్‌రాజు, సతీశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీ్‌సకు సంగీతం: రోహిత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: మహేశ్ కె.స్వరూప్.
