Namaste NRI

అందాల ముద్దుగుమ్మ‌ల‌తో మెగాస్టార్ చిరంజీవి

 మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూనే ఉంటారు. సంద‌ర్భానుసారంగా ఆయన చేసే ట్వీట్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తూ ఉంటుంది. అయితే ఈ రోజు ఉమెన్స్ డే కాగా, ఒక రోజు ముందుగానే చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో త‌న స‌తీమ‌ణి, అల‌నాటి అందాల హీరోయిన్స్‌తో క‌లిసి దిగిన పిక్ షేర్ చేశారు. దానికి కామెంట్‌గా తన నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని విజయాన్ని అందించిన హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.చిరు షేర్ చేసిన ఫొటోలో ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ‌తో పాటు ఆయ‌న‌తో క‌లిసి న‌టించిన రాధిక, టబు, నదియా, జయసుధ, మీనా, సుహాసిని, కుష్బూ ఉన్నారు. చిరంజీవి త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో ప‌ని చేసిన కూడా ఎక్క‌డా ఆయ‌న గురించి నెగెటివ్ వార్త‌లు రాలేదు. ద‌టీజ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ మెగాస్టార్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events