అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత భారం పడనుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది.హెచ్-1బీ ఆశావహులకు షాక్ ఇచ్చే వార్త ఇది. ప్రతిపాదిత బడ్జెట్ రీకాన్షిలియేషన్ బిల్లుకు అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపితే.. హెచ్-1బీ వీసా మరింత భారం కానున్నది. వీసా దరఖాస్తు ఫీజుకు సప్లిమెంటరీ ఫీజు కింద అదనంగా 500 డాలర్లను (రూ.37,280) వసూలు చేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే, హెచ్`1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లే భారత ఐటీ నిపుణులపై ఆర్థిక భారం మరింతగా పెరుగనున్నది.
హెచ్-1బీ వీ దరఖాస్తు రుసుమును పెంచితే గనుక ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. హెచ్`1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది.