గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రామబాణం. దర్శకుడు శ్రీవాస్. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చాడు. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-51.jpg)
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై కాస్తో కూస్తో మంచి బజ్నే క్రియేట్ చేశాయి. పైగా ఈ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కాగా సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచి ప్రమోషన్లను స్టార్ట్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. కాగా ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌ను ఏప్రిల్ 20న భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-107.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-55.jpg)