Namaste NRI

ట్రంప్ ఆఫ‌ర్‌కు ఓకే చెప్పిన మ‌స్క్‌

ఒక‌వేళ రాబోయే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తాను గెలిస్తే, టెస్లా చీఫ్ ఎల‌న్ మ‌స్క్‌ను అడ్వైజ‌ర్‌గా నియ‌మించ‌కో నున్న‌ట్లు అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఆ ఆఫ‌ర్‌కు స్పేస్ఎక్స్ సీఈవో మ‌స్క్ రియాక్ట్ అయ్యారు. ట్రంప్‌కు అడ్వైజ‌ర్‌గా ప‌నిచేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు మ‌స్క్ వెల్ల‌డించారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిస్తే, మ‌స్క్‌కు క్యాబినెట్ హోదా ఇవ్వ‌నున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఒక‌వేళ తాను వైట్‌హౌజ్‌కు వ‌స్తే, అప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో తాను ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు మ‌స్క్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ ప్ర‌భుత్వ ఏర్ప‌డితే, మ‌స్క్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events