ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం డ్రింకర్ సాయి. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్ బసవరాజు నిర్మాతలు. డిసెంబర్ 27న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. హైదరాబాద్‌లో మీడియాకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించా రు. తాను అనుకున్న పాయింట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యిందని, ఫలితం పట్ల అందరం ఆనందంగా ఉన్నామని, హీరోహీరోయిన్లతోపాటు ఇరవైమంది కొత్తవాళ్లను ఈ సినిమా ద్వారా పరిచయం చేశామని దర్శకుడు తెలిపారు. ఇప్పటి వరకూ 5.75 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసిందని నిర్మాతలు తెలిపారు.ఈ సందర్భంగా హీరో ధర్మ మాట్లాడుతూ ఈ సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకో స్థానం కల్పించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని మరోసారి రుజువైంది అని అన్నారు.