![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Mayfair-9.jpg)
ఎం.ఎన్.వి.సాగర్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం కాలం రాసిన కథలు. కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక, నిర్మాత సాగర్ మాట్లాడుతూ ఇది నా రెండేళ్ల కష్టం. కొత్తవాళ్లను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పనిచేసిన అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. ఈ విజయం నేను తర్వాత చేయబోయే సినిమాలపై విశ్వాసాన్ని పెంచింది అని చెప్పారు. ఇంకా ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన హన్విక శ్రీనివాస్, ఉమా రేచర్ల, వికాస్ ఈ సినిమాలో నటించే అవకాశాన్నిచ్చిన దర్శక, నిర్మాత సాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Ixora-9.png)