Namaste NRI

ఈ సినిమాతో నా కోరిక తీరింది :  నాని

నాని   కథానాయకుడిగా మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా ఖన్నా ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం హాయ్‌ నాన్న. శౌర్యువ్‌ దర్శకుడు. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. ఆడపిల్ల తండ్రిని కావాలనేది నా కోరిక. కానీ అబ్బాయి పుట్టాడు. వాడితోనే సరిపెట్టుకున్నా. కానీ ఈ సినిమాతో నాకోరిక తీరింది. నాకూ ఓ కూతురు దొరికింది అన్నారు.  నా మనసుకు చాలా దగ్గరైన కథ ఇది. భావోద్వేగ పూరితమైన కథ, కథనాలతో సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. నా కూతురుగా నటించిన బేబీ కియారా పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. శౌర్యువ్‌ ఖచ్చితంగా పెద్ద దర్శకుడవుతాడు అని నాని అన్నారు.

మంచి సినిమా చేశామనే సంతృప్తితో ఉన్నామనీ, డిసెంబర్‌ 7న సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నామని నిర్మాతలు చెప్పారు. ఇంకా దర్శకుడు శౌర్యువ్‌, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, బేబీ కియారా కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌, నిర్మాణం: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events