మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం నా లవ్ స్టోరీ. వినయ్ గోను దర్శకుడు. దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను దర్శకుడు అజయ్భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఫస్ట్లుక్ ఇన్నోవేటివ్గా ఉందన్నారు. కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్డ్రాప్లో నడిచే హృద్యమైన ప్రేమ కథాంశమిదని, నేటి యువత బాగా కనెక్ట్ అవుతుందని దర్శకుడు తెలిపారు. హార్ట్టచింగ్గా సాగే ప్రేమకథకు సంగీతాన్నందించడం ఆనందంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: లోకేష్ తాళ్లపాక, సంగీతం: చరణ్ అర్జున్, నిర్మాణ సంస్థలు: మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్, రచన-దర్శకత్వం: వినయ్ గోను.
