Namaste NRI

నాదానియన్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ అగ్ర న‌టుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్ర‌హీం అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. ఇబ్ర‌హీం అలీఖాన్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న చిత్రం నదానియన్. ఈ సినిమాలో శ్రీదేవి చిన్న‌కూతురు ఖుషి క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. షాన గౌతమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా,  ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్, అపూర్వ మెహతా, సోనేం మిశ్రా క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా త్వ‌ర‌లోనే ప్రీమియ‌ర్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ గ‌మనిస్తే,  ఈ చిత్రం యూత్‌ఫుల్ క‌థ‌తో రాబోతున్న‌ట్లు తెలుస్తుంది.

 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events