తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ కుట్రలను బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ చెప్పినట్లుగా ఆయనపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ వేధింపులేనని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. అవన్నీ ఆధారాలు లేని లొట్టపీసు కేసులు మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ చట్టంపై ఉన్న గౌరవంతో విచారణకు కేటీఆర్ సమగ్రంగా విచారణకు సహకరించడం ఆయన గొప్ప నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కార్ రేసు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. అవి తెలంగాణ అభివృద్ధిని గర్వంగా తెలియజేస్తున్నాయని తెలిపారు. కానీ దానిపై కాంగ్రెస్ అసత్యప్రచారాలు చేసి, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కేటీఆర్ నిబద్ధత, నిజాయితీ, ధైర్యం మనందరికీ స్పూర్తి అని తెలిపారు. బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ దక్షిణాఫ్రికా శాఖ తరపున, ఆయనకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రైతుల భరోసా కోసం కృషి చేయడం తమకు గౌరవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ రాజకీయాలను ఆపి, ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.