Namaste NRI

నాని క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 గ్లింప్స్ రిలీజ్

నాని హీరోగా నటిస్తున్న చిత్రం హిట్  ది థర్డ్ కేస్. శైలేష్‌ కొలను దర్శకత్వం. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా నాని పాత్రపై స్నీక్‌ పీక్‌ అందిస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు. మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్‌ ఆఫీసర్‌ని ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లు ఛేజ్‌ చేస్తుండగా ఈ గ్లింప్స్‌ మొదలైంది. హిట్‌ ఆఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌గా నాని సిగార్‌ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్ గా ఫెరోషియస్‌గా కనిపించారు. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని, నిర్మాణం: వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events