Namaste NRI

నాని : హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌ .. కాశ్మీర్ షెడ్యూల్ షురూ

హిట్‌  సిరీస్‌ చిత్రాల్లో తొలి రెండు భాగాలు థ్రిల్లింగ్‌, సస్పెన్స్‌ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దాంతో హిట్‌: ది థర్డ్‌ కేస్‌ పై అంచనాలు పెరిగాయి. నాని కథానాయకుడిగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాని కి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. శ్రీనిధిశెట్టి కథానాయిక. నాని పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ తాజా షెడ్యూల్‌ కశ్మీర్‌లో మొదలైంది. నానితో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలతో పాటు ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నాని పాత్ర శక్తివంతంగా ఉంటుందని, మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. వచ్చే ఏడాది మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌, రచన-దర్శకత్వం: శైలేష్‌ కొలను.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress