విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను అనుకున్న విధంగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. జులై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. అయితే తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ లాస్ట్ వరకు ఓటీటీ లో విడుదల చేయొద్దని చెప్పినా నారప్ప ను ఓటీటీ లో సురేష్ బాబు రిలీజ్ చేయడం విశేషం.