అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్‌మోర్‌లు త్వరలోనే భూమికి చేరనున్నారు. వారిని తీసుకొచ్చేందుకు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రత్యేక మిషన్ విజయవంతమైంది. స్పేస్ ఎక్స్ పంపిన క్రూ-9 స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్‌ఎస్‌కి చేరింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. డ్రాగన్ స్పేస్ స్టేషన్‌కు చేరినట్లు వెల్లడించారు.
కాగా, బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో ఇద్దరు వ్యోమగాములు గత 100 రోజులుగా అంతర క్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.