నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ఢిల్లీకి తరలించాని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆయనను ఢిల్లీకి తీసుకురానున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-108.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-56.jpg)
కాగా, గత నెలరోజుల్లో అధ్యక్షుడు పౌడెల్ అనారోగ్యానికి గురవడం ఇది రెండో సారి. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన త్రిభువన్ టీచింగ్ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-52.jpg)