నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ పార్లమెంట్‌లో తనపై ప్రవేశపెట్టిన విశ్వాసపరీక్షలో ఓడిపోయా రు. ప్రభుత్వానికి సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మరోసారి కేపీశర్మ ఓలి నేపాల్ ప్రధాని పీఠం ఎక్కనున్నారు. నేపాల్ పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో 275 మంది సభ్యులుండగా, ప్రచండకు మద్దతుగా 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2022 డిసెంబర్ 25న ప్రధాని పదవిని చేపట్టిన ప్రచండ గత రెండేండ్లలో నాలుగుసార్లు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌తో కలిసి కేపీ ఓలీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు.