Namaste NRI

నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్ళు మూవీ.. టీజర్ రిలీజ్

టాలీవుడ్ యువ న‌టులు సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రధారులు గా వ‌స్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా, నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. టీజర్‌ను హీరో నితిన్‌ విడుదల చేశారు. ఇందు లో ఓ మిత్రబృందం తాలూకు బాల్యాన్ని, యుక్తవయసులో వారు చేసిన సరదా సంగతులను చూపించారు. చివరగా ఊరిలో యువత ఎందుకు గొడవల్లోకి దిగుతారు. అందుకు కారణమేమిటనే అంశాలను తెరపై చూడాల్సిందేనంటూ ఆసక్తిగా టీజర్‌ను ముగించారు.

సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్‌దేవ్‌, రచన-దర్శకత్వం: యదు వంశీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events