రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని చెప్పా రు. అయితే ప్రస్తుతానికి అమెరికా నాయకత్వంపై భారత్‌కు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ చాలా తెలివిగా ఆలోచిస్తోందన్నారు. అందుకే రష్యాతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తోందన్నారు. అదే సమయంలో అమెరికాను బలహీనంగా చూస్తోందని వ్యాఖ్యానించారు.
అగ్రరాజ్యం తరఫున భారత వ్యవహారాలను చూశాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. భారత దేశం మాతో (అమెరికా) భాగస్వామిగా ఉండాలని కోరుకుంటోంది. మేము రష్యాతో భాగస్వామిగా ఉండాలను కోవట్లేదు. భారత్‌కు మనం గెలుస్తామన్న నమ్మకం లేదు. మనం చాలా బలహీనంగా ఉన్నామనుకుంటోంది. భారత్ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది. అందుకే వారికి భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది అని నిక్కీ హేలీ అన్నారు.