హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ఈటల గెలుపును అడ్డుకోలేరని కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండ జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ను ఓడిరచేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ కు ఓటమి తప్పదని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ దాటి బయటకి రావడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమన్న కేసీఆర్ ఏడేళ్లలో రూ.వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఈటల రాజేందర్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హుజూరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కరోనాను అరికట్టేందుకు ఈటల రాజేందర్ అంకితభావంతో పనిచేశారు. రూ.1900 కోట్లతో వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేసిన ఘనత నరేంద్ర మోదీ అన్నారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో కిసాన్ యూరియాని కేంద్రం ఉ్పత్తి చేస్తోంది. బీసీల హక్కులను కాపాడేందుకు మోదీ కృషి చేస్తున్నారు. తెలంగాణలో మార్పునకు మొదటి అడుగు హుజూరాబాద్ నుంచే పడాలి. 2023లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.