ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమ జోలికి వస్తే ఊరుకునేదని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడం తో, దాన్ని ఉద్దేశించి అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఎదురయ్యే ముప్పును అన్ని మార్గాల ద్వారా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా రక్షణ శాఖ తాజాగా స్పందించింది. మా అంతరిక్ష ఆస్తులపై అమెరికా దాడులకు ప్రయత్నిస్తే మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వంసం చేస్తాం. అలాంటి చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తాం అని అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరించింది.
