అవికాగోర్ టైటిల్‌రోల్ పోషిస్తున్న వెబ్ సిరీస్ వధువు. నందు, అలీ రెజా కీలక పాత్రధారులు. పోలూరు కృష్ణ దర్శకుడు. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాతలు. ఈ నెల 8న నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ అనుభవాలను అవికా గోర్ విలేకరులతో పంచుకున్నారు. ఇటీవల మాన్షన్ 24 అనే వెబ్‌సిరీస్ చేశాను. ఆ షూటింగ్‌లోనే నాకు వధువు కథ చెప్పారు. సక్సెస్‌ఫుల్ బెంగాలీ వెబ్‌సిరీస్ ఇందుని తెలుగులో వధువుగా తీస్తున్నారు. ఈ ప్రపోజల్ నాదగ్గరకొచ్చినప్పుడు ఎైగ్జెట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ నా కెరీర్‌లో ఇప్పటివరకూ చేయలేదు అని అన్నారు.
ఇందులో అందరూ అనుకున్నట్టు హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి. ఇప్పటివరకూ టీవీ కంటెంట్‌ని ఇష్టపడేవారు వధువు తో ఓటీటీకి వస్తారు అని అవికా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కథలో చాలా ప్రశ్నలు ఉంటాయని, అవన్నీ ఆసక్తిని కలిగిస్తాయని, చిన్నారి పెళ్లికూతురు టైమ్‌లో చిన్నపిల్లని కావడంవల్ల పెళ్లి అంటే ఏంటో కూడా తెలిసేదికాదు, డైరెక్టర్‌ని అడిగి తెలుసుకొని చేసేదాన్నని, ఇప్పుడు పూర్తి అవగాహనతో నటిస్తున్నానని, ఇదంతా తన పాత్రల ద్వారా తెలుసుకున్న విజ్ఞానమేనని అన్నారు.