Namaste NRI

మరోసారి జోడీగా…విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ  కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న 54వ ప్రాజెక్ట్‌. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం.  బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.  కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్ చల్‌ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. అయితే మృణాళ్‌ ఠాకూర్‌, రష్మిక మందన్నా ఇన్‌స్టాస్టోరీస్‌లో పెట్టిన పోస్ట్‌ ప్రకారం ఈ ఇద్దరూ ఒకే లొకేషన్‌లో ఉన్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే సమ్‌థింగ్‌ స్పెషల్ కోసం షూటింగ్‌ కొనసాగుతోంది. త్వరలో అదేంటో చెబుతానంటూ రాసుకొచ్చింది. ఈ రెండూ సింక్ అవుతుండటంతో రష్మిక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించనుండటం దాదాఫు ఫైనల్ అయినట్టేనని క్లారిటీ వచ్చేస్తుంది.

గీతగోవిందం, డియర్‌ కామ్రేడ్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ జోడీగా క్రేజ్‌ సంపాదించిన విజయ్‌, రష్మిక కాంబో,  ఈ సినిమాలో మరోసారి మెరువబోతున్నారని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్‌, ఫ్యాన్స్‌. మరి దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో చూడాలంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events