కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన పీరియాడిక్ థ్రిల్లర్ క. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. నయన్‌సారిక, తన్వీ రామ్ కథానాయికలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో నయన్ సారిక మాట్లాడుతూ గం గం గణేశాలో మోడ్రన్‌గా, ఆయ్ లో ట్రెడిషనల్‌గా కనిపించా. వాటికంటే భిన్నమైన పాత్ర క లో చేశా. ఇందులో నా కేరక్టర్ పేరు సత్యభామ. ఇది 70sలో జరిగే కథ. అందుకే సావిత్రిగారిని ప్రేరణ తీసుకొని చేశా. ఆమెలా నేనూ గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు తెప్పించగలను. ఇందులో హీరో నన్ను సావిత్రిలా ఉన్నావ్ అంటాడు. ఆ డైలాగ్ నా పాత్రకు రిలవెంట్‌గా ఉందని డైరెక్టర్స్ అన్నారు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు. మాలో హీరో పెయిర్ ఎవరు? అనేది మూవీలోనే చూడాలి. ఎన్నో మలుపులున్న కథ ఇది. యూనివర్సల్ పాయింట్, ఏ ఒక్కరికో పరిమితం కాని కథ. వాస్తవానికి దగ్గరగా పాత్రలుంటాయి అని తెలిపింది. తన్వీరామ్ చెబుతూ ఇందులో నా పాత్ర పేరు రాధ. నా పర్సనల్ క్యారెక్టర్‌కి భిన్నమైన పాత్ర ఇది. కథలో కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. తనొక స్కూల్ టీచర్. కిరణ్ అబ్బవరం, నయన్‌సారిక పాత్రలు ఓ టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తే, నేను మరో పీరియడ్‌లో కనిపిస్తా. నా పాత్రకూ, వారి పాత్రలకూ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అనేది స్క్రీన్‌పైనే చూడాలి. కృష్ణగిరి అనే ఊరు ఈ కథలో కీరోల్ ప్లే చేస్తుంది. క్లైమాక్స్ మరో స్థాయిలో ఉంటుంది. కథంతా ఎమోషన్సే. విడుదలయ్యాక క గురించి పూర్తిగా మాట్లాడతా అని చెప్పుకొచ్చింది. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.