కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ 2. లక్షల చెక్కును మొగులయ్యకు అందజేసి సత్కరించారు. పవన్ కల్యాణ్ తన ట్రస్ట్ పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా. దాసరి రంగాకు రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు.
ఉమ్మడి పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య భీమ్లా నాయక్ చిత్రంలో ఆలపించిన ఉపోద్ఘాట గీతం విశేష ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికలపై ఈ పాట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మొగులయ్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు.