ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రణమండల అనే భారీ డివోషనల్ ఎంటైర్టెనర్ తెరకెక్కనుంది. ఆంజనేయుని నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయి. ఆదోని రణమండల దేవాలయంలో ఆంజనేయుని సన్నిధిలో, వేదపండితుల ఆశీర్వచనా లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు. రణమండల ఆంజనేయుని క్షేత్ర నామాన్నే ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం విశేషం. పూర్తిగా ఆదోని పరిసరాల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇది మా సంస్థ నుంచి వస్తున్న 46వ చిత్రం. దర్శకుడు, నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.