అగ్ర కథానాయిక పూజా హెగ్డే తాజాగా కోలీవుడ్లో మరో భారీ ఆఫర్ను దక్కించుకుంది. రజనీకాంత్ కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్పెషల్సాంగ్లో నర్తిస్తున్నదని తెలిసింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జరుగుతున్నదని, ఇందులో పూజాహెగ్డే నృత్యాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్ అంటున్నారు. పూజాహెగ్డేకు ఐటెంసాంగ్స్ కొత్తేమి కాదు. గతంలో రంగస్థలం, ఎఫ్-3 చిత్రాల్లో ఈ అమ్మడు ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం దేవ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలవడంతో పూజాహెగ్డేకు నిరాశే ఎదురైంది. హిందీలో వరుస ఫ్లాపులను దృష్టిలో పెట్టుకొని ఇకపై దక్షిణాది సినిమాలకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనలో ఉందట పూజాహెగ్డే.
