
పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మారుతి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు న్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్‌ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏడాది ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈసినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్ ఈ గ్లింప్‌కే కొత్త అందాన్ని తెచ్చిందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 40శాతం పూర్తయిందని, ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా ఈసినిమా నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
