ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రపంచం వణికిపోతుంటే, కొత్తగా చైనా కూడా యుద్ధ భేరీ మోగించేందుకు సిద్ధమవుతున్నది. తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతూ, ఆ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పతాక స్థాయికి చేరుకుంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తాజాగా పిలుపునిచ్చా రు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను జీ జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్రమైన శిక్షణ, సన్నద్ధతతో సైనిక బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. తమ పోరాట సామర్థ్యాల్ని పెంచుకోవాలి అని అన్నారు.