భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అఫ్గానిస్తాన్‌లోని తాజా పరిస్థితిపై చర్చించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఫోన్‌లో ఇద్దరు 45 నిమిషాల పాటు సంభాషించుకున్నట్లు మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్ పరిస్థితులపై పాటు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా సవివరంగా చర్చించినట్టు మోదీ తెలిపారు. తమ మధ్య ప్రయోజనకరమైన సంభాషణ జరిగిందని, పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామని మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి విషయంలో భారత్, రష్యా మధ్య సహకారంతో పాటు ద్వైపాక్షిక ఎజెండాపై చర్చించామన్నారు. ముఖ్యమైన విషయాలపై సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించినట్లు మోదీ వివరించారు. అనంతరం నేతల మధ్య చర్చకొచ్చిన వివరాలను తర్వాత ఢల్లీిలోని రష్యా రాయచార కార్యాలయం వెల్లడిరచింది. తాలిబన్ల రాకతో అఫ్గాన్‌లో పెచ్చరిల్లే ఉగ్రవాదం ముప్పు భారత్ వంటి దేశాలపై మరింతగా పడకుండా ఆపేందుకు, భారత్‌లోని మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు అడ్డుకునే లక్ష్యంతో భారత్, రష్యాల మధ్య ప్రత్యేకంగా దౌత్య వారథిని నిర్మించాలని అగ్రనేతలిద్దరూ నిర్ణయించారు అని ఎంబసీ వెల్లడిరచింది.