Namaste NRI

తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై .. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో నిరసనలు

తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌  ఇచ్చిన పిలుపుమేరకు ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే  ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలతో అభిషేకం చేశారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే ఫౌండర్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారని ఆరోపించారు.

ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమ ఉద్వేగానికి ప్రతీకగా నిలుస్తుందని, ఆమె రూపం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉద్యమస్ఫూర్తి రగులుతుందని పేర్కొన్నా రు. యావత్‌ తెలంగాణ జాతి సమష్టి ఉద్యమం, సాంస్కృతిక పోరాటం గుర్తుకు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్‌, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అవివేకమని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి యావత్‌ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందన్నారు.

అడ్వయిజరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గణేష్ కుప్పలా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని, విగ్రహాల మార్పు కాదని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా కాంగ్రెస్‌ నాయకులకు పాలన చేతగాక పనికిరాని విషయాలపై దృష్టి పెట్టడం దురదృష్టమన్నారు. ఉపాధ్యక్షుడు రవి రేటినేని మాట్లాడుతూ 20 ఏళ్ల కిందట ఉద్యమ సమయంలో మేధావులు, కవులు, కళాకారుల ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చి ప్రతిష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌పర్సన్‌ రమేష్ ఎసెంపెల్లి, కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, ప్రవాస తెలంగాణ వాదులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, సత్య మూర్తి చిలుము ల, రవి రేటినేని, సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, కార్యదర్శులు అబ్దుల్ జాఫర్, కమ్యూనిటీ సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, ఈవెంట్స్ ఇన్‌చార్జి తరుణ్ లునావత్, సభ్యులు పవన్ గౌడ్, నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress