రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా అధినేత కిమ్ పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. మరో లక్ష బలగాలను క్రెమ్లిన్‌కు పంపేందుకు కిమ్ అంగీకారం తెలిపారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్‌కు పుతిన్ బహుమతులు పంపుతున్నారు.
ఇప్పటికే అరుదైన జాతి గుర్రాలు, శునకాలు, మేకల్ని పంపిన పుతిన్, తాజాగా మరికొన్నింటిని గిఫ్ట్స్‌గా పంపారు. ఏకంగా 70కిపైగా జంతువులను బహుమతిగా పంపినట్లు తెలిసింది. ఇందులో ఒక ఆఫ్రికన్ సింహం, రెండు ఎలుగుబంట్లు, రెండు జడల బర్రెలు, ఐదు తెల్ల కోకాటూలు, 25 రకాల నెమల్లు, 40 మాండరిన్ బాతులు ఉన్నాయి. వీటన్నింటినీ ప్యాంగ్యాంగ్ సెంట్రల్ జూకు తరలించినట్లు తెలిసింది.