వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో అనామకుడిగా అడుగుపెట్టిన రచిన్ లీగ్ దవ ముగిసే సమయానికి అత్యుత్తమ ఆటతీరుతో నయా స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో పోరులో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి పెవిలియన్ చేరిన రచిన్ పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
తాజా మెగాటోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి దంచికొడుతున్న రచిన్ రవీంద్ర 565 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా 25 ఏండ్లు నిండక ముందు ఓ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ 523 పరుగులు చేయగా, ఇప్పుడు రచిన్ 23 ఏండ్ల వయసులో ఆ మార్క్ దాటి అగ్రస్థానానికి చేరాడు.