ధర్మ, చాందినిరావు, ప్రశాంత్, శివ, అశోక్ సంగా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం రణస్థలి. పరశురాం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సూరెడ్డి విష్ణు నిర్మాత. హైదరాబాద్‌లని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా పరశురాం చాలా బాగా డైరెక్ట్ చేశారు. వయోలెన్స్ బ్యాక్‌డ్రాప్‌తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసించారు. యాక్షన్ ప్రధానంగా సాగే కథ ఇది. హింసని ఓ కొత్త కోణంలో ఆవిష్కరించాం. బసవ పాత్రలో ధర్మ ఆకట్టుకుంటాడు. బసవ రణం ఎందుకు చేశాడనేది తెరపైనే చూడాలి. కొత్త దర్శకుడు పరుశురాం శ్రీనివాస్ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సంభాషణలు, సంగీతం చిత్రానికి ప్రధానబలం. కథానాయకుడు వెంకటేష్ టీజర్ చూసి అభినందించారని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు జాస్తి బాలాజీ, దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్, నిర్మాత సూరెడ్డి విష్ణు, కోప్రొడ్యూసర్ లక్ష్మీ జ్యోతి శ్రీనివాస్, హీరో ధర్మ, హీరోయిన్ చాందిని రావు, ప్రశాంత్, శివ, అశోక్ సంగా, అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)