Namaste NRI

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో.. బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌

రవితేజ హీరోగా  గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాకు అఫీషియల్‌గా ప్రకటించారు మూవీ మేకర్స్. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో మొదలుకానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా యునిక్‌, పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని మలినేని గోపీచంద్‌ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌ల కోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని, మునుపెన్నడూ చూడనంత శక్తిమంతమైన పాత్రలో రవితేజని ప్రేక్షకులు చూడబోతున్నారని, అలాగే వెర్సటైల్‌ డైరెక్టర్‌, యాక్టర్‌ సెల్వరాఘవన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన పాత్ర విభిన్నంగా మెమరబుల్‌గా ఉంటుందని మేకర్స్‌ తెలియజేశారు. జి.కె.విష్ణు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events