అరవింద్ కృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 1000 వర్డ్స్ . దివి వైద్యా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌కు రేణూదేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజర య్యారు. ఈ సందర్భంగా రేణూదేశాయ్ మాట్లాడుతూ రమణ ఫొటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఒక్క ఫొటో మీద కథ రాసుకుని ఈ సినిమా తీశారు. సినిమా చూసిన తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆయన నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నానన్నారు. సినిమాతో అందరినీ కంటతడి పెట్టించారన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించే ఈ సినిమాకు అవార్డులు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు అరవింద్ కృష్ణ చెప్పాడు. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ షూటింగ్‌లో గాయమవడంతో 8 నెలలు బెడ్‌పైనే ఉన్నా. ఆ టైంలోనే ఈ సినిమా అవకాశం వచ్చిందని, ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. ఈ చిత్రంలో మేఘన శ్రీనివాస్, వినయ్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రమణ విల్లర్ట్ స్వీయదర్శకత్వంలో విల్లర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కించారు.