అమెరికాలో రిపబ్లికన్ పార్టీ నేత వాలెంటినా గోమేజ్ ఓ వినూత్న స్టంట్ క్రియేట్ చేశారు. ఎల్‌జీబీటీని ప్రోత్సహించే పుస్తకాలను ఆమె తగులబెట్టారు. మిస్సోరీ రాష్ట్రం నుంచి పోటీలో ఉన్న ఆమె ఎన్నికల ప్రచారం కోసం ఈ స్టంట్ చేశారు. ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) పుస్తకాలను తగలబెడుతున్న వీడియోను ఆమె తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. మిస్సో రీ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికైతే ఎల్‌జీబీటీ పుస్తకా లను దగ్దం చేయనున్నట్లు ఆమె తన వీడియో కు కామెంట్ పెట్టారు. ఇవన్నీ మిస్సోరీ పబ్లిక్ లైబ్రరీ నుంచి వచ్చిన పుస్తకాలు అని, తాను ఆఫీసు చేపట్టిన తర్వాత వాటిని కాల్చివేయనున్నట్లు ఆమె ఆ వీడియోలో చెప్పా రు. 24 ఏళ్ల వాలెంటినా గోమేజ్ ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయను న్నారు. అయితే పిల్లలను ఎల్జీబీటీ వైపు ఆకర్షించే రీతిలో రాసిన పుస్తకాలను బ్యాన్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆ పుస్తకాలకు నిప్పుపెట్టే వీడియోను ఆమె ఎక్స్, ఎఫ్‌బీ, ఇన్‌స్టా అకౌంట్లలో పోస్టు చేసింది.