చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు నేతలతో భేటీ అయినప్పటికీ ఆయన ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.