Namaste NRI

ఎన్టీఆర్‌ చిత్రంలో సైఫ్‌అలీఖాన్‌

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  తాజాగా చిత్రబృందం ధృవీకరించింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ఎన్టీఆర్‌ 30 సినిమా సెట్స్‌లోకి సైఫ్‌అలీఖాన్‌ అడుగుపెట్టాడని పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్న బాలీవుడ్‌ నాయిక జాన్వీకపూర్‌ సైతం తాజా షూటింగ్‌లో పాల్గొంటున్నది. పవర్‌ఫుల్‌ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events